Thursday, November 21, 2024

డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్ కు కొత్త రూల్స్‌.. జులై 1 నుంచి అమలు

క్రెడిట్‌ కార్డ్సు, డెబిట్‌ కార్డ్సు వినియోగదారులకు జులై1 నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కార్డుల జారీపై కొత్త గైడ్‌లైన్స్ ను జారీ చేసింది. కస్టమర్ల అంగీకారం లేకుండా కొత్త కార్డులను జారీ చేయడం లేదా ఉన్న కార్డుల పరిమితిని పెంచడం వంటివి చేయవద్దని కార్డు జారీ చేసే సంస్థలకు తెలిపింది. ఆయాచిత కార్డులను జారీ చేసే సమయంలో, బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని పెనాల్టీగా ఆయా సంస్థలు చెల్లించవలసి వస్తోందని హెచ్చరించింది. క్రెడిట్‌ కార్డు బిల్లుల వసూలు కోసం కస్టమర్లను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకు గురి చేయవద్దని కార్డు సంస్థలు, థర్డ్‌ పార్టీ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల విషయానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుండి అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. రూ.100 కోట్ల వ్యాల్యూ దాటిన కమర్షియల్‌ బ్యాంకులు సొంతగా లేదా కార్డు సంస్థలు క్రెడిట్‌ కార్డులను జారీ చేయవచ్చునని తెలిపింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ముందుస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్డులను అందించవద్దని స్పష్టం చేసింది. కోబ్రాండెడ్‌ కార్డులు అందించిన సంస్థలు ఆ కార్డులను తమ సొంత కార్డుగా ప్రకటించుకోవద్దని తెలిపింది. ఫిర్యాదులను స్వీకరించే కస్టమర్‌ సేవల సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు పేమెంట్‌ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, డిస్ట్రిక్ట్‌ సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు మినహా అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.

అన్ని ఎన్‌బీఎఫ్‌సీ బ్యాంకులు కూడా ఈ కొత్త నిబంధనలను అనుసరించాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది. క్రెడిట్‌ కార్డు అనేది ముందుగా ఆమోదించబడిన రివాల్వింగ్‌ క్రెడిట్‌ పరిమితితో జారీ చేయబడిన గుర్తింపు సాధనాన్ని కలిగి ఉన్న భౌతిక లేదా వర్చువల్‌ చెల్లింపు సాధనం. నిర్దేశించిన షరతులు, నిబంధనలకు లోబడి వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి లేదా నగదు అడ్వాన్స్‌ డ్రా చేయడానికి ఉపయోగించబడుతుంది. రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ నికర వ్యాల్యూ కలిగిన రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు కాకుండా షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు క్రెడిట్‌ కార్డు వ్యాపారం కోసం ఇప్పుడు ఇండిపెండెంట్‌గా లేదా ఇతరులతో టైఅ్ఖప్‌తో క్రెడిట్‌ కార్డు వ్యాపారం చేయవచ్చు. క్రెడిట్‌ కార్డు వ్యాపారం కోసం ఆర్బీఐ నుండి ముందస్తు అనుమతి ఉంటుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఎన్బీఎఫ్‌సీలు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులు జారీ చేయరాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement