Saturday, November 23, 2024

New Rule – మూరలు లెక్కన పూలు అమ్మితే రూ. రెండు వేలు జరిమాన

తిరువనతపురం – మూరలు లెక్కన పూల దండలను అమ్మడానకి వీల్లేదట. ఒకవేళ అలా అమ్మితే రెండు వేలు వరకు జరిమాన విధిస్తారట. అంతేగాదు పూల దండలను మీటర్లు లేదా సెంటీమీటర్ల చొప్పునే అమ్మాలనే నిబంధన కూడా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ అంశం ఇప్పుడూ కేరళ అంతటా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..సాధారణంగా మల్లెలు, కనకాంభరాలు తదితర పూల దండలను మూరలెక్కనే అమ్మతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కేరళలో త్రిసూర్‌లో లీగల్‌ మెట్రోలజీ డిపార్ట్‌మెంట్‌ ఇక నుంచి అలా అమ్మకూడ దంటూ పూల వ్యాపారులకు నోటీసులు పంపింది. ఇలా అమ్మితే పూల దండ దాదాపు 24 అంగుళాలు లేదా 60 సెంటీమీటర్లే ఉంటుందని చెబుతోంది. ఇక నుంచి పూల దండలను సెంటీమీట్లర్లు లేదా మీటర్లలోనే కొలవాలని రూల్‌ పాస్ చేసింది.ఒకవేళ మూర లెక్కన అమ్మినట్లు తెలిస్తే వారికి రూ. 2000 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. కేరళలో ఈ అంశం ఒక హాట్‌టాపిక్‌గా మారిపోయింది

Advertisement

తాజా వార్తలు

Advertisement