Aadhaar: ప్రతిదానికి ఆధార్ ఐడెంటిటీ కంపల్సరీ అవుతోంది. అయితే నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుందామంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి. దానికి ఓటీపీ ఎంటర్ చేయాలి.. అయినా ఒక్కోసారి అది సరిగా వర్క్ కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అయితే ఆధార్ కార్డు వినియోగదారులకు మంచి ఉపయోగకరమైన వార్త ఇది.. ఇకమీదట ఆధార్ కార్డు డౌన్ లో డ్ చేసుకోవాలనుంటే.. ఇపుడు ఎలాంటి మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది. కొత్త ఆఫ్షన్‌ని ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.
ఎలాంటి ఓటీపీ లేకుండా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చని.. ఆధార్‌ను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (The Unique Identification Authority of India) ఈ విషయాన్ని ప్రకటించింది. మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకొని ఆధార్ కార్డు ఉన్న వారి కోసం ఈ ఆప్షన్ తీసుకొచ్చింది.