స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గ్యారేజీలో నానో కొత్త కారు చేరింది. విద్యుత్తు వాహనాల సంస్థ ఎలక్ట్రా ఈవీ అభివృద్ధి చేసిన సరికొత్త 72వీ నానో విద్యుత్తు కారు రతన్‌టాటా వద్దకు చేరింది. ఈ విషయాన్ని ఎలక్ట్రా ఈవీ వెల్లడించింది. రతన్‌టాటాకు కారు డెలివరీ చేసినందుకు సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. టాటా నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నామని ఎలక్ట్రా ఈవీ పేర్కొంది. సరికొత్త 72వీ నానో విద్యుత్ కారులో రతన్‌టాటా ప్రయాణించారు.
టాటా అందజేసిన ఫీడ్‌బ్యాక్ అమూల్యమైందిగా పేర్కొటూ రతన్‌టాటా కారుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా టాటా నానో ఈవీ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 160కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత రవాణా వాహనాన్ని అందించడమే లక్ష్యంగా నానో ఈవీని ఆవిష్కరించినట్లు ఇంతకుముందే టాటా మోటార్స్ వెల్లడించింది.