Saturday, November 23, 2024

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరో పేరు!

హుజురాబాద్ ఉప‌ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజులో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ నుంచి ఈటల బరిలో ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థి విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఈటలకు ధీటుగా ఉండే అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే.. టీఆర్ఎస్ పార్టీ తరుపున హుజురాబాద్ బరిలో దిగుతున్నారంటూ కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సహా ఇటీవల ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి కడియం తదితరుల పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు మరో పేరు వెలుగులోకి వచ్చింది. హుజురాబాద్ ఉప‌ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గ టిక్కెట్‌ను బీసీ లేదా రెడ్డి కమ్యునిటీకి చెందిన వారికి ఇవ్వాలని ఎప్పటి నుంచో పార్టీ పెదలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు హుజురాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ తనకే అంటూ అనుచరులతో ఆయన ఫోన్లో మాట్లాడిన సంభాషణలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌‌పై తిరుగుబావుటా ఎగురవేసి కౌశిక్‌రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో టీఆర్ఎస్‌‌లో జరుగుతున్న ప్రచారం ఆయన అనుచరులకు ఆందోళన కలిగిస్తోంది. తీరా పార్టీలో చేరాక టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోతే కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement