క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుల బిల్లుల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.. బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నూతన గైడ్‌లైన్స్ జారీ చేసింది. క్రెడిట్ కార్డుల బిల్లులపై ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలు జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్రెడిట్ కార్డుల జారీ చేసిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆయా క్రెడిట్ కార్డుల బిల్లులు, ఈ-మెయిల్స్‌కు బిల్లులు, స్టేట్‌మెంట్లను సకాలంలో కస్టమర్లకు పంపించడంలో జాప్యం చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డు బిల్లులపై వడ్డీరేటు చార్జీ చేసే గడువు ప్రారంభం కాకముందే కనీసం 15 రోజుల ముందు ఆ బిల్లులు కస్టమర్లకు చేర్చాలని ఆర్‌బీఐ రూల్స్ పెట్టింది.
ఇక బిల్లింగ్ జాప్యంపై తరుచుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల యజమానులు సంబంధిత ఖాతాదారుల ఆమోదంతో వారికి బిల్లులు లేదా స్టేట్‌మెంట్లను ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పంపాలి. క్రెడిట్ కార్డు బిల్లింగ్ స్టేట్‌మెంట్‌ను కస్టమర్ అందుకున్నట్లు తెలిపే వ్యవస్థను బ్యాంకర్లు అందుబాటులోకి తేవాలి. క్రెడిట్ కార్డు జారీదారులు తప్పుడు బిల్లులు కార్డు దారులకు జారీ చేయొద్దు. ఒకవేళ కార్డు యజమాని ఏదేనీ బిల్లుపై నిరసన తెలిపితే, అందుకు సరైన వివరణ ఇవ్వాలి. పత్రాలతో కూడిన ఆధారాలను తెలపాలి. ఫిర్యాదుచేసిన 30 రోజుల్లో సదరు కార్డు దారుడికి పత్రాలతో కూడిన ఆధారాలివ్వాలి.
కాగా, కార్డు యజమాని ఫ్రాడ్‌గా పేర్కొన్న లావాదేవీపై వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి ఆ చార్జీలు వసూలు చేయరాదని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది. క్రెడిట్ కార్డు యజమానులు అన్ని కార్డుల యజమానులకు స్టాండర్డ్ బిల్లింగ్ సైకిల్‌ను అనుసరించాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు యజమానులు, కార్డు యజమానుల మధ్య ఫ్లెక్సిబిలిటీ కోసం వన్‌టైం ఆప్షన్‌తో క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ను సవరించుకోవచ్చు. ఏదేనీ క్రెడిట్ బిల్లును గడువులోగా చెల్లించకపోతే తక్షణం పేమెంట్ డ్యూ (adjusted against the ‘payment due’ ) ను సర్దుబాటు చేసి, కార్డు యజమానికి సమాచారం ఇవ్వాలని ఆర్‌బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.