Friday, November 22, 2024

ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కళ్లు ఎర్రగా మారడం, జుట్టు రాలడం..

Omicron Symptoms: ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ  జనాలను భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అనేక ప్రపంచదేశాలకు పాకింది. అటు అమెరికా, యూకేలతో పాటు ఫ్రాన్స్ లోనూ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే యూకేలో ఏకంగా 2 లక్షల 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు తేలింది. అయితే.. కరోనా వల్ల కలిగే లక్షణాల్లో ప్రధానంగా జలుబు, జ్వరం, ఊపిరి ఆందకపోవడం, అలసట వంటి లక్షణాలుండేవి.

కానీ, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారికి కొత్తగా మరో రెండు లక్షణాలను గమనించినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ యూకేలో వేలాది మందికిపైగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ బ్రిటన్ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ శాతం ఎలాంటి లక్షణాలు కనిపించడం  లేదని తెలుస్తోంది. కానీ, కొంతమందిలో మాత్రం జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటి దుర్వాసన, రుచిని కోల్పవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వెల్లడైంది. 

కొత్తగా మరో రెండు లక్షణాలు

ఒమిక్రాన్ సోకిన వారిలో కొంతమందికి కళ్లు ఎర్రబడడం.. క్రమంగా జుట్టు రాలడం ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు ఉండవచ్చు. యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ACE2) అనే ఎంజైమ్ ద్వారా కరోనా వైరస్ ప్రజల కణాలలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఒమిక్రాన్ వైరస్ కళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుందని భయపడుతున్నారు.  

కళ్లకు సోకడం

- Advertisement -

కొంతమంది వైద్యుల నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కళ్లలోకి ప్రవేశించిన తర్వాత.. రెటీనా, ఎపిథీలియల్ కణాలకు సోకుంతుంది. ఈ రెండు కణాలు కళ్లు, కనురెప్పల భాగాలను తెల్లగా మారతాయి. ఒమిక్రాన్ కారణంగా కళ్లు ఎర్రగా మారడం సహా వాపు, డీహైడ్రేషన్, నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయని డాక్టర్లు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి లక్షణాలపై ప్రస్తుతం అధ్యయనాలు జరుగుతున్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement