Saturday, November 23, 2024

Smart Tech: వాట్సాప్​లో కొత్త ఫీచర్లు.. వీడియో కాలింగ్​ మరింత బెటర్​గా!

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ మ‌ధ్య‌నే ప్ర‌యోగాత్మ‌కంగా 32 మందితో గ్రూప్ వీడియో కాల్ ప‌రీక్షించి స‌క్సెస్ సాధించారు. ఈ మేర‌కు 32 మంది గ్రూప్ కాలింగ్‌లో కాల్ లింక్స్ ప్రారంభించిన‌ట్లు వాట్సాప్ పేరెంట్ సంస్థ ‘మెటా`స్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ చెప్పారు. సింగిల్ ట్యాప్‌తో కాల్ ప్రారంభించ‌డానికి లింక్‌ను ఈ వారంలో వాట్సాప్ ప్రారంభిస్తుంద‌న్నారు. త్వ‌ర‌లో 32 మందితో సెక్యూర్డ్ ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాల్‌ను అందుబాటులోకి తెస్తామ‌న్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

కాగా, భార‌త్‌లో వాట్సాప్‌కు గ‌త జూన్ నాటికి 487.5 మిలియ‌న్ల యూజ‌ర్లున్నారు. ఈ యూజ‌ర్లు త‌మ కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో వీడియో కాల్ కోసం కాల్ లింక్ క్రియేట్ చేసుకోగ‌లిగే వెసులుబాటు ఉంటుంది. అందుకు వాట్సాప్ యూజ‌ర్లు యాప్ లేటెస్ట్ వ‌ర్ష‌న్ అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్‌లో వ‌స్తున్న న్యూ ఫీచ‌ర్​తో వీడియో కాలింగ్‌, కాన్ఫ‌రెన్సింగ్ యాప్‌ల మ‌ధ్య పోటీని పెంచుతుంద‌ని టెక్​ అనలిస్టులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement