మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్యనే ప్రయోగాత్మకంగా 32 మందితో గ్రూప్ వీడియో కాల్ పరీక్షించి సక్సెస్ సాధించారు. ఈ మేరకు 32 మంది గ్రూప్ కాలింగ్‌లో కాల్ లింక్స్ ప్రారంభించినట్లు వాట్సాప్ పేరెంట్ సంస్థ ‘మెటా`స్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. సింగిల్ ట్యాప్‌తో కాల్ ప్రారంభించడానికి లింక్‌ను ఈ వారంలో వాట్సాప్ ప్రారంభిస్తుందన్నారు. త్వరలో 32 మందితో సెక్యూర్డ్ ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
కాగా, భారత్‌లో వాట్సాప్‌కు గత జూన్ నాటికి 487.5 మిలియన్ల యూజర్లున్నారు. ఈ యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వీడియో కాల్ కోసం కాల్ లింక్ క్రియేట్ చేసుకోగలిగే వెసులుబాటు ఉంటుంది. అందుకు వాట్సాప్ యూజర్లు యాప్ లేటెస్ట్ వర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్‌లో వస్తున్న న్యూ ఫీచర్‌తో వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ యాప్‌ల మధ్య పోటీని పెంచుతుందని టెక్ అనలిస్టులు భావిస్తున్నారు.