స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరి దగ్గరా ఈ యాప్ తప్పకుండా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మెస్సేజింగ్ పరంగా ఇది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తోంది. ఈ యాప్ వచ్చిన తర్వాత అసలు ఎస్ఎంఎస్లను చేయడమే జనాలు మరిచిపోయారు. అంతా ఈ యాప్ ద్వారానే సమాచారం షేర్ చేసుకుంటున్నారు. అంతటి సెన్సేషన్‌గా మారిన వాట్సాప్‌లో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ రాబోతోంది.
వాట్సాప్ లో చాటింగ్ చేస్తుంటాం.. లేకుంటే గ్రూపుల్లోనో, ఎవరైనా పంపినవో వీడియోలు, ఫొటోలు చూస్తుంటాం. ఆ సమయంలో మనం ఆన్ లైన్ లో ఉన్నట్టు అందరికీ తెలిసిపోతుంటుంది. అలా కనిపించకుండా ఆఫ్ చేసుకుందాం అనుకుంటే.. మిగతా ఎవరైనా ఆన్ లైన్ లో ఉన్నారో, ఆఫ్ లైన్ లో ఉన్నారో మనకు తెలియదు. ఈ క్రమంలోనే కావాలనుకున్నవారికే ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.
అంతేకాదు.. గ్రూపుల్లోంచి ఎవరికీ తెలియకుండా ఎగ్జిట్ కావడం, ఒకసారి చూసిన వెంటనే డిలీట్ అయిపోయేలా మెసేజీలు పంపడం, అలా పంపిన వ్యూ వన్స్ మెసేజీలను స్క్రీన్ షాట్ తీసుకునే వీలు లేకుండా చేయడం వంటి మరిన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది వాట్సాప్ సంస్థ. ఇవన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు ఆ కంపెనీ ప్రతినిధులు.