Saturday, November 23, 2024

అలర్ట్: ఏపీలో వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్.. 15 రెట్లు ప్రమాదకరం

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏపీలో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడిందని వెల్లడించంది. ఈ కొత్త వేరియంట్ ఇండియాలో ఇప్పుడు ఉన్న వైరస్ కంటే 15 రెట్లు ప్రమాదకరం అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కరోనాకు చెందిన 5 వేరియంట్లు కనుగొన్నారు. వీటిలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో ఏపీ స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తోంది.

ఏపీ స్ట్రెయిన్ వైరస్ సోకిన రోగులు 3-4 రోజుల్లో హైపోక్సియా లేదా డిస్ప్నియా గురవుతారు. ఈ పరిస్థితిలో శ్వాస రోగి ఊపిరితిత్తులకు చేరుకోవడం ఆగిపోతుంది. సరైన సమయంలో చికిత్స లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల రోగి మరణిస్తాడు. ఈ వైరస్ చైన్ సమయానికి విచ్ఛిన్నం కాకపోతే ఈ సెకండ్ వేవ్ కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్న కరోనా జాతులు B.1617, B.117 కన్నా ప్రమాదకరమైనది.

గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్, ప్రైమరీ సోర్స్ GISAID దక్షిణ భారతదేశంలో కనిపిస్తున్న వివిధ వైవిధ్యాల వ్యాప్తిని వివరించింది. దీని ప్రకారం ఈ స్ట్రెయిన్ కర్నూలులో మొదట గుర్తించారు. ఈ వైరస్ విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఏపీలోని కర్నూలులో ఈ జాతిని మొదట గుర్తించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది సామాన్య ప్రజలలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్తున్నారు. వైరస్ సోకిన రోగి గతంలో హైపోక్సియా లేదా డిస్ప్నియా దశకు చేరుకోవడానికి కనీసం ఒక వారం సమయం పడుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు మూడు లేదా నాలుగు రోజుల్లో రోగులు పరిస్థితి విషమంగా మారుతోందని, అందుకే ఆక్సిజన్, బెడ్స్, ఐసీయూ పడకల అవసరం బాగా పెరిగిందని ఏపీలోని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈ వేరియంట్ యువకుల్లోనూ పిల్లల్లోనూ కూడా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్న వారు కూడా దీని బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రజలు మంచి మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం, గుంపులకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వీలైనంత వరకు ఇంట్లో ఉండడం చాలా ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement