Friday, November 22, 2024

మరో కరోనా వేరియంట్..పేరు ‘లాంబ్డా’

కంటికి కనిపించని కరోనా ప్రపంచానితో ఓ ఆట ఆడుకుంటోంది. ఇన్నాళ్లు ఫస్ట్, సెకండ్ వేవ్ తో జనులను ముప్పతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి.. ఇప్పుుడు కొత్త కొత్త రూపాలు మార్చుకుంటు వేరియంట్ల రూపంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆల్పా, గామా, డెల్టా, డెల్టా ప్లస్ వంటి ప్రమాదకర కరోనా వేరియంట్ల స్థానంలో కొత్తగా ‘లాంబ్డా’ వచ్చి చేరింది. గతేడాది ఆగస్టులో పెరులో బయటపడిన ఈ రకం ఇప్పుడు 29 దేశాలకు విస్తరించింది. ఇందులో పెరు సహా చిలీ, ఈక్వెడార్, అర్జెంటినా వంటి దేశాలు ఉన్నాయి. ఈ వేరియంట్‌ను ‘దృష్టిసారించాల్సిన వైరస్ రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా..తాజాగా ‘లంబ్డా’ అనే వేరియంట్‌ను యూకేలో కూడా గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఈ విష‌యాన్ని (పీహెచ్ఈ) వెల్ల‌డించింది. గత వారం యూకేలో బ‌య‌ట‌ప‌డ్డ‌ కొవిడ్ కేసుల్లో 42 శాతం డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులున్నాయి. తాజాగా ‘లంబ్డా’ వేరియంట్‌కు చెందిన 6 కేసులను కనుగొన్నట్టు పీహెచ్ఈ పేర్కొన్న‌ది.

కొత్త వేరియంట్‌ వెలుగు చూడటంతో దాని ప్రభావంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న‌ద‌ని పీహెచ్ఈ తెలిపింది. అయితే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి తాజా వేరియంట్‌తో ముప్పేమి ఉండక‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది. దీనిపై ఇతమిద్దంగా ఒక అభిప్రాయానికి రావడానికి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, లంబ్డా వేరియంట్‌తో మరింత ఎక్కువ ప్రమాదం ఉందా, లేదా అనే విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement