దేశంలో రోజురోజుకు ఎక్కువ అవుతున్న సైబర్ నేరాలకు చెక్ చెప్పేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ డెబిట్ విధానంలో మార్పులు చేసింది. ప్రతినెలా EMI, బిల్లులు బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లింపులు జరిగేలా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఇకపై వేటికిపడితే వాటికి వాటంతట అవే డెబిట్ కుదరదు. దీంతో OTT, DTH, ఫోన్ బిల్లులకు ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవ్వవు. ఏప్రిల్ 1 నుంచి స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ డీయాక్టివేట్ అవుతాయి.
ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు మెయిల్స్ రూపంలో ఈ సమాచారం పంపించాయి. ఇకపై ఇలాంటి సేవలకు బిల్లులు చెల్లించాలంటే ఆయా కంపెనీల వెబ్‌సైట్ లేదా యాప్‌ల ద్వారా చెల్లించుకోవాల్సిందే. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా మీరు చెల్లింపులు చేసుకోవడంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ చెల్లింపులకు మళ్లీ ఓటీపీ అవసరమవుతుంది. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంపైనే ఈ లావాదేవీలు విజయవంతం అయ్యే అవకాశముంది.