కొత్త కారు కొనేందుకు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది టాటా మోటార్స్ (TATA MOTORS COMPANY) కంపెనీ. కార్ లోన్ సెగ్మెంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా (BANK OF INDIA)తో కొత్త డీల్ (DEAL) చేసుకుంది. టాటా మోటార్స్ కారును కొనాలంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నుంచి లోన్ తీసుకునే చాన్స్ మరింత మెరుగుకానుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యం కింద BOI టాటా మోటార్స్ కస్టమర్లకు 6.85 శాతం వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తామని కంపెనీ తెలిపింది.
ఈ కొత్త పథకం కింద వాహనం మొత్తం ధరలో గరిష్టంగా 90 శాతం రుణం ఇస్తామని టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో బీమా, రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. కస్టమర్లు ఏడేళ్ల (SEVEN YEARS) చెల్లింపు వ్యవధిలో లక్షకు రూ. 1,502 నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ)ని ఎంచుకోవచ్చని టాటా మోటార్స్ ప్రకటించింది.
ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే..
ఈ పథకంలో కస్టమర్లకు మరికొన్ని సౌకర్యాలున్నాయి. ఒక కస్టమర్ మార్చి 31, 2022 నాటికి టాటా మోటార్స్ కారును కొనుగోలు చేస్తే లోన్ ప్రాసెసింగ్ (PROCESSING FEE) ఫీసు తీసుకోబోమని కంపెనీ తెలిపింది. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే లోన్ ఇస్తారు. దీని కోసం కస్టమర్ ఏ ఆదాయ స్లాబ్ లో ఉన్నాడో కూడా చూడబోమని తెలిపింది. ఈ ఆఫర్ కొత్త ఫరెవర్ రేంజ్, SUVలపై మాత్రమే వర్తించనుంది.
ఇది కూడా చదవండి: Big Story: ఓసారి ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ స్టేట్ లీడర్లకు హై కమాండ్ పిలుపు..
టాటా మోటార్స్ కంపెనీ కస్టమర్ల కోసం ఇలాంటి మరిన్ని ఆఫర్లను కూడా ప్రవేశపెడుతోంది. గతంలో టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా కొత్త ICE కార్లు, SUVలు, వ్యక్తిగత సెగ్మెంట్ ఎలక్ట్రిక్ (ELECTRIC VEHICLES) వాహనాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. టాటా మోటార్స్ కార్ కొనుగోలుదారులు కూడా ఈ ఆఫర్లో 31 మార్చి 2022 వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎప్పటికప్పుడు పెరుగుతున్న టాటా మోటార్స్ షేర్ మార్కెట్ దృష్ట్యా, కంపెనీ మరింత ఎక్కువ మంది వినియోగదారులకు తన పరిధిలోకి తీసుకురానుంది. కారు రుణాన్ని మరింత ఈజీగా చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని కంపెనీ అధికారులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily