Tuesday, November 26, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక‌పై వాయిస్ మెసేజ్‌ రివ్యూ సౌలభ్యం

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు టెక్ట్స్ మెసేజ్‌లను మాత్ర‌మే స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని పంపేవాళ్లం. కానీ ఈ సౌల‌భ్యం వాయిస్ మెసేజ్‌లకు లేదు. ఒక‌సారి రికార్డు చేశాక పంప‌డ‌మో, లేక డిలీట్ చేయ‌డ‌మో త‌ప్పా.. అస‌లు అది క‌రెక్ట్ గా ఉందో లేదో సెండ్ చేయ‌క ముందు వినే అవ‌కాశం లేదు. పంపిన త‌ర్వాతే వినాలి. కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ ల‌ను సెండ్ చేయ‌క‌ముందే అది క‌రెక్టుగా ఉందో లేదో వినే ఫీచ‌ర్ ను వాట్సాప్ తీసుకురానుంది. అంతేకాకుండా వాయిస్‌ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల‌లో వినే అవ‌కాశం ఉంటుంది. రానున్న‌ రోజుల్లో వాయిస్‌ మెసేజ్‌లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ తో వినేలా వాట్సాప్ ఓ ఫీచ‌ర్ తెస్తోంది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్లలో వాట్సాప్‌ తీసుకువస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement