తిరుపతి ఉపఎన్నికను ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థుల తరుపున జోరుగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో లోకేష్ మరోసారి పప్పులో కాలేశారు. అడ్డంగా నెటిజన్లకు, ప్రభుత్వానికి మరోసారి దొరికిపోయారు. ఇంతకీ నారా లోకేష్ ఈసారి చేసిన పొరపాటు ఏంటని అనుకుంటున్నారా ?
ఆదివారం వరదయ్యపాళెంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ.. ఆమెను గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గుతాయి అని అన్నారు. లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నెటిజన్లతో పాటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఎలా సాధ్యం లోకేష్ బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు.
పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపునకు సంబంధం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ఒక ఎంపీ సీటుతో ప్రెటోల్, గ్యాస్ ధరలు ఎలా తగ్గుతాయో వివరిస్తే.. అందరికి అర్ధం అవుతుందని,అంటే మీరు ఎన్డీయేలో చేరుతారా? లేక పనబాక లక్ష్మి ప్రెట్రోలియం శాఖ మంత్రి అవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేం విచిత్రమంటూ లోకేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.