కామాంధుడికి బుద్ధి చెప్పింది ఓ యువతి. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడి పెదవిని తన పళ్లతో బలంగా కొరికింది. దెబ్బకు ఆ కామాంధుడి పెదవి ఊడి కింద పడింది. ఆ కామాంధుడు బాధతో ఏడవడం ప్రారంభించాడు. మరోవైపు.. ఆ యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడి పెదవి భాగాన్ని ప్యాకెట్లో సీలు చేశారు. గాయపడిన నిందితుడిని సమీపంలోని సిహెచ్‌సికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించారు. ఈ వ్యవహారమంతా దారౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. లావాడ్ గ్రామానికి చెందిన మోహిత్ సైనీపై వేధింపులు, అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో ఆ యువతి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.కాగా తన పొలంలో పనిచేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. నిశ్శబ్దం ఆవరించింది. చుట్టూ ఎవరూ లేరు. అంతలో ఒక్కసారిగా వెనుక నుంచి ఓ యువకుడు వచ్చి పట్టుకున్నాడు. దీంతో ఆమె భయాందోళనకు గురైంది. ఎవరు పట్టుకున్నారో అర్థం కాలేదు. మహిళ కేకలు వేయడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమె గొంతును పట్టుకుని చంపేస్తానని బెదిరించారు. వెంటేనే ఆ యువకుడు పొలంలో ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. కాగా నిందితుడు తన పేరు మోహిత్ సైనీ అని, లావాడ్లోని మొహల్లా సైయన్ నివాసి అని చెప్పాడు. అతను ఏ లక్ష్యం కోసం గ్రామానికి చేరుకున్నాడు అనేది ఆరా తీస్తున్నారు. బాధితురాలు అతనికి ముందే తెలుసా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఆపద సమయంలో ధైర్యంగా ఉండి.. తనను తాను రక్షించుకున్న ఆ మహిళ చూసిన స్థానికులు మెచ్చుకున్నారు. కామాంధుడి సరైన తీరులో బుద్ది చెప్పిందని ఆమెను ప్రశంసిస్తున్నారు.