టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కులాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. సినీ ఇండస్ట్రీలో కుల అధిపత్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.‘మా’ ఎన్నికలు సందర్భంగా మంచు విష్ణుకు మద్దుతు ప్రకటించిన కోటా.. ఓ ఇంటర్వ్యూలో కులానికి సంబంధించిన విషయంపై మాట్లాడారు. నేను ఇండస్ట్రీలో 40 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నానంటే కమ్మవారి వల్లేనంటూ వ్యాఖ్యానించారు. ‘నా వరకూ నేను ఒక సామాజిక వర్గాన్ని గౌరవించుకుంటాను. ఎందుకు అంటే నూటికి 95 శాతం నేను కమ్మ వాళ్ల ఫుడ్ తిన్నాను.. మిగిలిన 5 శాతం రాజులు, రెడ్లు ఉన్నారు. నేను ఓపెన్‌గా చెప్తున్నా.. నేను కమ్మవాళ్ల కూడే తిన్నాను. అది మర్చిపోకూడదు. మంచి చేస్తే మంచి చేశారని చెప్పాలి.. ఇప్పుడు నేను అదే చెప్తున్నా’ అంటూ కోటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. దీంతో మా ఎన్నికల్లో ఓటర్లు కూడా కులం చేసే ఓట్లు వేశారా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ప్రతి రంగంలో కులాన్ని మధ్యలో తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: గుజరాత్ తోపాటు తెలంగాణ ఎన్నికలు: ముందస్తు ఎన్నికలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు