పాపులర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ Netflix తన సబ్‌స్క్రైబర్స్‌ని పెద్ద ఎత్తున కోల్పోతోంది. దీంతో అది ఇప్పుడు చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ మళ్లీ యూజర్స్‌ని రాబట్టుకునే పనిలో పడింది. iPhone, iPad యూజర్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌లోకి సైన్ఇన్ అయ్యేలా ఎక్స్టర్నల్ వెబ్‌పేజీకి రీ డైరెక్ట్ చేయడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి డిజిటల్ కంటెంట్‌కు యాక్సెస్‌ను అందించే “రీడర్” యాప్‌లను తమ సొంత వెబ్‌సైట్‌లలోని ఖాతా సైన్-అప్ పేజీలకు లింక్ చేయడానికి ఆపిల్ పర్మిషన్ ఇచ్చిన కొద్ది నెలల తర్వాత ఈ మార్పు వచ్చిందని టెక్ ఎనలిస్ట్ అయి ‘ది వెర్జ్’ ఈ వివరాలను వెల్లడించింది.
2018 వరకు iPhone, iPad యాప్‌లలో Netflix ఎక్స్టర్నల్ సైన్అప్ కోసం వెబ్ లింకులను అందించలేదు. అదే విధంగా వినియోగదారులు ఎక్కడ సైన్ అప్ చేయవచ్చో కూడా చెప్పలేదు. యాప్‌ను యాక్సెస్ చేయడానికి ముందు దీన్ని సైన్ అప్ చేయడానికి యూజర్లు వారి వెబ్ లేదా మొబైల్ బ్రౌజర్ నుండి Netflix వెబ్‌సైట్‌కి నావిగేట్ చేయాల్సి ఉంటుంది.
ఇంతకుముందు అంతా Apple కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా జరిగింది. దీని వలన యాప్‌లను కొనుగోలు చేయడంపై కూడా నిబంధనలు పెట్టింది. 30 శాతం కమీషన్‌ను పొందడాన్ని ఆపిల్ ఆపేసింది. అంతేకాకుండా డెవలపర్‌లు ఎక్స్టర్నల్గా సైన్-అప్ పేజీకి లింక్‌ను అందించకుండా నిరోధించింది. యాప్‌ని ఉపయోగించి నెట్‌ఫ్లిక్స్ కు సైన్ అప్ చేయగలరని భావించే కొత్త వినియోగదారులకు ఈ సెటప్ గందరగోళంగా ఉండేది. అయితే, ఇప్పుడు iPhone, iPad వినియోగదారులు Netflix యాప్‌లోని ఒక ఎక్స్టర్నల్ లింక్ సైనప్ చేసుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే..ఈ ఎక్స్టర్నల్ లింక్‌పై ట్యాప్ చేసిన యూజర్లకు ఒక ఎర్రర్ మెస్సేజ్ వస్తోంది. “యాప్ నుండి నిష్క్రమించబోతున్నారు” అని హెచ్చరించే సందేశాన్ని చాలామంది గమనించినట్టు సమాచారం. అట్లాగే ఐఫోన్లో ఉండే యాప్ ద్వారా కాకుండా ఎక్స్టర్నల్ లింక్‌పై క్లిక్ చేయగానే వెబ్ పేజీలో నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇది Apple యాప్స్‌తో యాక్సెస్ కాకుండా ఎక్స్టర్నల్గా వర్క్ చేస్తుందని, యాపిల్‌తో దీనికి ఎట్లాంటి సంబంధం ఉండదని ఆ సంస్థ తెలియజేస్తోంది.
ఇక.. వార్నింగ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా వినియోగదారులు Netflix వెబ్‌సైట్‌లోని సైన్-అప్ పేజీకి చేరుకోవచ్చు. అక్కడ వారు సబ్‌స్ర్కిప్షన్ సమాచారం ఆధారంగాచందా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అయితే.. నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన ఈ న్యూ ఆప్షన్ తో చాలా గందరగోళం ఉందని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యూజర్లనుంచి కామెంట్స్ వస్తున్నాయి.