గత వారం రోజులుగా రష్యా- ఉక్రెయిన్ ల వార్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే రష్యన్ చానల్స్‌ను ఏవీ తాము ప్రసారం చేయడం లేదని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన వారం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే యూ ట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ రష్యా ప్రభుత్వ చానల్స్‌పై నిషేధం విధించాయి. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానల్స్ అన్నీ ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతాయని అందుకే వాటిని ప్రసారం చేయడం లేదని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి చెప్పారు. రష్యాలో ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ అడుగుపెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital