మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ వెబ్ సిరీస్ చేయాలని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఇచ్చి రామ్ చరణ్ తో వెబ్ సిరీస్ చేయించాలని సదరు నెట్ ప్లిక్స్ భావిస్తున్నారు. నిజంగానే రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ఓటీటీలో అడుగు పెడితే మాత్రం నిజంగానే మిగిలిన పెద్ద హీరోలు కూడా అటుగా ఆలోచిస్తారనడంలో సందేహమే లేదు. మరి సోషల్ మీడియాలో రామ్ చరణ్ డిజిటల్ ఎంట్రీపై వినిపిస్తోన్న వార్తలపై మెగా క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అవి కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటికే RRR సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న RC 15 ఇప్పుడు చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తి కాక మునుపే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతిని అధికారికంగా కూడా ప్రకటించారు. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..