Friday, November 22, 2024

ఆ జగన్నాథుడి మాదిరిగానే.. జెట్ బ్లాక్ లో నేతాజీ విగ్రహం: శిల్పి గడాయనక్

ఇండియా గేట్‌ సమీపంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ ని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు నేతాజీ విగ్రహం ఒడిశాలోని జగన్నాథుడి విగ్రహంలా జెట్ బ్లాక్‌గా ఉంటుందని విగ్రహ రూపకర్త శిల్పి అద్వైత గడాయనక్ వెల్లడించారు. విగ్రహాన్ని తయారు చేయడానికి 28 అడుగుల పొడవు, 8×8 అడుగుల గ్రానైట్ స్లాబ్ కోసం చూస్తున్నాం. గ్రానైట్ జెట్ బ్లాక్‌గా ఉంటే బాగుంటుందని చెప్పాను. మైసూరు, బెంగళూరు, తెలంగాణలోని మూడు ప్రదేశాలలో మంచి గ్రానైట్ కోసం పరిశీలిస్తున్నాం.  సరైన స్లాబ్‌ను ఎంపిక చేసేందుకు త్వరలో ఆయా ఏరియాలను సందర్శిస్తాం అని గడానాయక్ తెలిపారు. అంతేకాకుండా తాను ఒడిశాకు చెందినవాడినని, అదే రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తి విగ్రహాన్ని తయారు చేయడం కూడా తన అదృష్టంగా భావిస్తున్నట్టు గడాయనక్ తెలిపారు.

ఆగస్టు 15వరకు నేతాజీ కొత్త విగ్రహం..

ఆగస్టు 15 వ తేదీ నాటికి నేతాజీ కొత్త విగ్రహాన్ని తయారు చేస్తామని, దాని ఇన్‌స్టాలేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని శిల్పి గడాయనక్ తెలిపు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున నేతాజీ నూతన విగ్రాహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే విగ్రహానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ వచ్చిందన్నారు. దీనికి సంబంధించి కనెక్షన్ ఎలా జరిగిందో తెలియదు కానీ, గత ఏడాది మేం ప్రధానితో కలిసి కోల్‌కతా సందర్శించినప్పటి నుంచి నేతాజీ విగ్రహం కోసం ప్లాన్ చేస్తున్నాం. నాలుగు రోజుల క్రితం ప్రధాని మోడీ తనకు గ్రానైట్‌లో నేతాజీ విగ్రహం కావాలని చెప్పారు.. అని గడాయనక్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement