Tuesday, November 19, 2024

RTI ACT: సుభాస్​ బోస్​ బతికే ఉన్నారా? గుమ్నామీ బాబా ఎవరు!.. ఆర్టీఐ అర్జీకి సమాధానం ఇవ్వని కేంద్రం

ఆజాద్​ హింద్​ పౌజ్​ దళపతి సుభాష్​ చంద్రబోస్​ మరణంపై మిస్టరీని ఛేదించడానికి ఓ వ్యక్తి ఆర్​టీఐని ఆశ్రయించాడు. 1945, ఆగష్టు 18వ తేదీన తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్​ బోస్ మరణించాడని డిక్లేర్​ చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తప్పించుకోవడానికి బోస్ ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని కొంతమంది అంటున్నారు. కానీ, బోస్​ గుమ్నామీ బాబాగా అవతారం మార్చుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడని, అతని డీఎన్​ఏ పరీక్షల ద్వారా నేతాజీ మరణం మిస్టరీ వీడుతుందనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై పరిశోధనలు చేస్తున్న యాక్టివిస్టు, హూగ్లీలోని కొన్నాగర్ నివాసి అయిన సాయక్ సేన్ ఆర్టీఐ చట్టం కింద సుభాష్​ బోస్​ వివరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ అర్జీని దాఖలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన దాఖలు చేసిన ఈ ఆర్టీఐ అర్జీ ఇప్పుడు మరోమారు చర్చనీయాంశంగా మారింది. అయితే.. 8(1)(A), (E), 11( సెక్షన్‌లను ఉటంకిస్తూ) సాధు వేషంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొందరు నమ్ముతున్న గుమ్నామీ బాబా యొక్క DNA నమూనాకి చెందిన ఎలెక్ట్రోఫెరోగ్రామ్ నివేదికను షేర్​ చేయడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది.  

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం వాటిని బహిర్గతం చేయడం వల్ల సార్వభౌమాధికారం, సమగ్రత లేదా భారతదేశం పక్షపాతంగా ప్రభావితం అవుతాయని, దేశ భద్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. దీనిపై పరిశోధకుడు సాయక్ సేన్ వేసిన ఆర్​టీఐ అర్జీని కేంద్రం తిరస్కరించిందని, మూడు కారణాల ఆధారంగా ఎలక్ట్రోఫెరోగ్రామ్ నివేదికను ఇవ్వలేమని సమాధానం ఇచ్చారని ఆయన చెబుతున్నాడు.

ఇక.. ఎలెక్ట్రోఫెరోగ్రామ్ అనేది ఎలెక్ట్రోఫోరేసిస్ ఆటోమేటిక్ సీక్వెన్సింగ్ ద్వారా చేసిన విశ్లేషణ నుండి వచ్చిన ఫలితాల ప్లాట్. ఎలక్ట్రోఫెరోగ్రామ్ ఆటోమేటెడ్ DNA సీక్వెన్సింగ్ మెషిన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన డేటా క్రమాన్ని అందిస్తుంది. ఎలెక్ట్రోఫెరోగ్రామ్‌లను దీని నుండి ఫలితాలను పొందేందుకు ఉపయోగించవచ్చు. ఇది.. వంశపారంపర్య DNA పరీక్ష , లేదా పితృత్వ పరీక్షగా చెబుతారు.

- Advertisement -

ఎలక్ట్రోఫెరోగ్రామ్‌ను 3 కారణాల వల్ల ఇవ్వలేమని తనకు అధికారికంగా చెప్పారు. మరీ ముఖ్యంగా దానిని బహిరంగపరచడం భారతదేశ సార్వభౌమత్వాన్ని, విదేశీ రాష్ట్రాలతో సంబంధాలను ప్రభావితం చేస్తుంది” అని సేన్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో నివసించిన వ్యక్తి భారతదేశ అంతర్జాతీయ సంబంధాలకు అంతగా ప్రాధాన్యత ఇస్తారని.. అతని ఎలెక్ట్రోఫెరోగ్రామ్‌ను బహిరంగపరిస్తే దేశంలో ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తారని కూడా సేన్ తన RTIలో ప్రశ్నించారు.

కాగా, గుమ్నామీ బాబా ఒక కామన్ మ్యాన్ కంటే చాలా ఎక్కువ అని, ప్రత్యేకమైన వ్యక్తి అని స్పష్టమైన సూచనగా సేన్​ భావిస్తున్నాడు. తన అన్వేషణల ప్రకారం అతను నేతాజీ సుభాష్ చంద్రబోస్ వేషధారణలో ఉన్నాడని నమ్ముతున్నాను” అని సేన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement