నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబా భారత పర్యటనకు రానున్నారు. జనవరి రెండో వారంలో ఆయన భారత్ లో పర్యటనకు రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రధానిగా రెండోసారి షేర్ బహదూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు నిర్వహించనున్నారు.
కాగా, ఈ ఏడాది మొదట్లో నేపాల్ ప్రధాని పీఠాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓలి కంటే ముందు కూడా నేపాల్ కు ప్రధానిగా దుబా ఏడు నెలల పాటు పనిచేశారు. ఆ సమయంలో భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో చర్చలు కూడా నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..