ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరో రూపం దాలుస్తోందా? కొత్త మ్యూటేషన్లతో జనాలపై దండెత్తేందుకు నయా రూపం సంతరించుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణుల. ప్రపంచ మానవాళికి డెల్టా, ఒమిక్రాన్ కాకుండా ఇప్పుడు మరో కొత్త వైరస్ ప్రమాదం పొంచి ఉందంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. అయితే.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వైరస్ ‘నియోకోవ్’ కావచ్చని చైనాలోని వుహాన్ నగర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ కొత్త కరోనా వైరస్ చాలా ప్రమాదకారి అని.. అది అత్యంత వేగంగా అంటు వ్యాధిలా సోకుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా అది సోకిన ముగ్గురిలో ఒకరు కచ్చితంగా చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ కొత్త కరోనా నియోకోవ్ దక్షిణాఫ్రికాలో కనుగొన్నట్టు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ వైరస్ కొత్తది కాదని, ఇంకా మనుషులకు వ్యాపించలేదని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ నియోకోవ్ కరోనా వైరస్ మార్స్ కోవ్ వైరస్‌కు సంబంధించిందని, దీని వ్యాప్తి మొదటిసారిగా 2012, 2015లో పశ్చిమాసియా దేశాల్లో కనుగొన్నట్టు తెలుస్తోంది. ఇది SARS-CoV-2 మాదిరిగానే ఉంటుంది. మానవులలో కరోనా వైరస్ సంక్రమణకు కారణమవుతుందని ఆ నివేదకలో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఈ నియోకోవ్ వైరస్ గబ్బిలాల్లో కనిపించింది. ఇది ఇప్పటివరకు జంతువులలో మాత్రమే ఉందని, ఇంకా మానవులకు సోకలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొత్త కరోనా వైరస్ , ప్రస్తుత వైరస్ లక్షణాలు..
BioRxiv వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. NeoCoV , దాని సన్నిహిత వైరస్ PDF-2180-CoV మానవులకు సోకవచ్చు. వుహాన్ విశ్వవిద్యాలయం , చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త కరోనా వైరస్ మానవ కణాలకు సోకడానికి ఒక మ్యుటేషన్ మాత్రమే అవసరం. NeoCoV వైరస్ MERS మాదిరిగానే చాలా మంది మరణానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ప్రతి ముగ్గురు బాధితులల్లో ఒకరు చనిపోయే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అదే సమయంలో ఈ NeoCoV వైరస్ ప్రస్తుత SARS-CoV-2 కరోనా వైరస్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తించే అంటువ్యాధిగా పరిణమిస్తోంది. దీనికి సంబంధించి రష్యా ప్రభుత్వ వైరాలజీ రీసెర్చ్ సెంటర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నియోకోవ్ కరోనా వైరస్‌పై చైనా పరిశోధకులు సేకరించిన డేటా వెక్టర్ రీసెర్చ్ సెంటర్‌కు చేరవేశారు. ప్రస్తుతం ఇది మానవులకు సోకే సామర్థ్యాన్ని కలిగి లేదని, అయితే దాని ప్రమాదం దృష్ట్యా మరిన్ని అధ్యయనాలు అవసరం అని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.