ఓం కారేశ్వర్ ఠాకూర్ లను బెయిల్ ఇస్తున్నట్లు ఢిల్లీ హై కోర్టు తెలిపింది. బుల్లీ భాయ్ యాప్ కేసులో నీరజ్ బిష్ణోయ్, సుల్లీ డీల్సీ యాప్ సృష్టికర్త ఓంకారేశ్వర్ ఠాకూర్‌లకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు చెప్పింది. మానవతా కోణంలో ఆ బెయిల్‌ను మంజూరీ చేశారు. నేరస్తులు ఇద్దరూ తొలిసారి నేరాలకు పాల్పడ్డారని, వారిని నిత్యం జైలులో నిర్బంధించడం సరికాదన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. అయితే కఠిన ఆంక్షల నడుమ ఆ ఇద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. సాక్ష్యులను బెదిరించడం కానీ, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం కానీ చేయకూడదని కోర్టు చెప్పింది. బెయిల్ మీద ఉన్నన్ని రోజులు నిందితులు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదని, పిలిచిన ప్రతిసారీ కోర్టుకు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. మెజిస్ట్రేట్ డాక్టర్ పంకజ్ శర్మ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారు. 50 వేల బాండ్ పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement