కరోనా కారణంగా తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. పెరోల్ పై వారు బయటకు వెళ్లి ఇక జైలుకు తిరిగిరాలేదు. దీంతో మిస్సయిన ఖైదీల ఆచూకీ చెప్పిన వారికి ఢిల్లీ పోలీసులు బహుమతిని కూడా ప్రకటించారు. తీహార్ జైలులో 2020లో వచ్చిన కరోనా సందర్భంగా దాదాపు ఆరు వేల మంది ఖైదీలకు పెరోల్ లభించింది. పెరోల్ సమయం పూర్తి కాగానే తిరిగి వాళ్లు జైలుకు రావాల్సి ఉంటుంది. కానీ ఆరు వేల మందిలో 3,400 మంది మాత్రమే తిరిగి జైలుకు వచ్చారు.
మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు అధికారుల్లో ఆందోళన మొదలైంది. వీరిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కూడా ఐదువేల మంది పెరోల్ పై వెళ్లారు. కరోనా వైరస్ విజృంభించడంతో పెద్దయెత్తున ఖైదీలకు పెరోల్ లభించింది. ఖైదీలు తిరిగి రాకపోవడంతో వారి ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు బహుమానం ప్రకటించింది. మొత్తానికి అంత పెద్ద ఎత్తున ఖైదీలు మిస్సవడంతో జైలు అధికారులు వారిని ఎలాగైనా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital