Saturday, October 19, 2024

దేశంలో దాదాపు 18 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం మేరకు 17,91,77,029 టీకాలు వేసినట్లు పేర్కొంది. మూడో దశ ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో 18-44 మధ్య వయస్సున్న వారికి 39,14,688 డోసులు వేసినట్లు వివరించింది. ఇప్పటి వరకు వేసిన టీకాల్లో 96,16,697 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు మొదటి డోసు, 66,02,553 మందికి రెండో డోసు వేసినట్లు పేర్కొంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో 1,43,14,563 మందికి మొదటి, మరో 81,12,476 మందికి రెండో మోతాదు అందించినట్లు తెలిపింది.

మరోవైపు 18-44 మధ్య వయస్సున్న 39,14,688 మంది లబ్ధిదారులకు తొలి మోతాదు వేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య వారికి 5,65,82,401 మొదటి, 85,14,552 మందికి రెండో డోస్‌ వేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 60 ఏళ్లు పైబడిన 5,42,32,598 మందికి మొదటి, 1,72,86,501 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది. టీకా డ్రైవ్‌ గురువారం నాటికి 118వ రోజుకు చేరగా.. నిన్న ఒకే రోజు 19,75,176 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇందులో 10,10,856 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 9,64,320 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement