Wednesday, November 27, 2024

నవీన్ పట్నాయక్ మద్దతు కోరిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు సొంత రాష్ట్రం ఒడిశాకు వచ్చిన ఆమె.. నవీన్ పట్నానాయక్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేడీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ద్రౌపది ముర్మును నవీన్ పట్నానాయక్ సత్కరించారు. ఇప్పటికే ముర్ముకు మద్దతు ప్రకటించిన బీజేడీ, మిగతా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీలో ప్రస్తుతం బీజేడీకి 112 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి 22 మంది సభ్యులున్నారు. ఇక ఒకరు స్వతంత్రులు కాగా.. మరొకరు వాపక్షాలకు చెందిన వ్యక్తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement