Tuesday, November 26, 2024

Breaking: ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ రాజీనామా…

ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనపై పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల కారణంగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది. ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన జితేంద్ర అవద్‌.. ఉద్దవ్‌ ఠాక్రే క్యేబినెట్‌లో హౌజింగ్‌, మైనార్టీ అఫైర్స్‌ మంత్రిగా కొనసాగారు. తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జితేంద్ర అవద్‌ ప్రకటించారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆయన తన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement