Saturday, November 23, 2024

మోదీతో పవార్ చర్చించిన అంశాలేంటి?

మరో రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఇటీవల రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అనంతరం శరద్ పవార్ ప్రధాని మోదీతో సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రధాని నరేంద్రమోడీతో శరద్ పవార్ భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న అంశంపై వివరాలు బయటికి రాలేదు. అయితే రాష్టపతి పదవికి అభ్యర్ధిగా తనకు మద్దతివ్వాలని శరద్ పవార్ పలు పార్టీల్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు పలు బీజేపీయేతర పార్టీల అధినేతలతో ఇప్పటికే భేటీ అయిన పవార్ తన మనసులో మాట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దుతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీయేతర పార్టీల మద్దతు సంపాదించిన పవార్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీల మద్దతు కూడా కోరినట్లు రాజకీయవర్గల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇఫ్పటికే తన రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబంధించి వస్తున్న ఊహాగానాల్ని పవార్ తోసిపుచ్చారు. అయితే, కీలక నేతలతో ఆయన భేటీలు కావడం ఆసక్తిరేపుతోంది.

ఇది కూడా చదవండి: కలం పక్కనెట్టి.. హలం చేతబట్టి..

Advertisement

తాజా వార్తలు

Advertisement