స్టార్ హీరోయిన్ నయనతార..దర్శకుడు విఘ్నేష్ శివన్ లు జూన్ 9వ తేదీన వివాహం చేసుకోనున్నారు. కాగా వీరి వివాహం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో జరగబోతోంది అంటూ పెద్దఎత్తున ప్రచారం నడిచింది. అనూహ్యంగా కొన్ని అనుకోని కారణాలవల్ల వారి వివాహ వేదిక మారినట్లుగా సమాచారం. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది . కుటుంబసభ్యులు , బంధుమిత్రులు కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం జరగబోతోంది. ఇప్పటికే బంధువులకు, అతిథులకు డిజిటల్ ఇన్విటేషన్ వీడియో కూడా పంపించారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఒక డిజిటల్ ఇన్విటేషన్ కార్డు వీడియో ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇక అందులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 9వ తేదీన మహాబలిపురంలో ఉన్న మహబ్ హోటల్లో వీరి పెళ్లి జరగబోతుంది.ఇండస్ట్రీలో సన్నిహితుల కోసం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగే అవకాశం ఉందట. విగ్నేష్ , నయన్ దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
జూన్9న నయనతార-విఘ్నేశ్ శివన్ ల పెళ్లి – వైరల్ అవుతోన్న వెడ్డింగ్ కార్డ్
Advertisement
తాజా వార్తలు
Advertisement