స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు బిజినెస్ లలోకి అడుగుపెడుతోంది. మరో కొత్త వ్యాపారంలోకి నయనతార అడుగుపెడుతోంది. ది లిప్ బామ్ కంపెనీ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్ ను స్టార్ట్ చేసింది.చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనతారపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..