బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలక్షణ నటుడిగా పేరు పొందాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సిరీస్ , సెక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ బంగ్లా సిద్ధమైందని న్యూస్ పోర్టల్ పింక్ విల్లా వెల్లడించింది. ఈ ఇంటికి నవాజుద్దీన్ సిద్ధిఖీ తండ్రి నవాబుద్దీన్ సిద్ధిఖీ పేరు పెట్టారని, దానిని నవాబ్ అని పిలుస్తారని పేర్కొంది..నవాజుద్దీన్ సిద్ధిఖీ తండ్రి 2015లో 72 ఏళ్ల వయసులో మరణించారు.ఈ ఇల్లు పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. తానకి నచ్చినట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నారట నవాజుద్దీన్. కాగా నవాజ్ ఓ పోస్ట్ పెట్టాడు..ఒక మంచి నటుడు ఎప్పుడూ చెడ్డ వ్యక్తి కాలేడు, ఎందుకంటే అతని అంతర్గత స్వచ్ఛత మంచి చర్యను బయటకు తెస్తుంది అని పోస్ట్ చేశాడు. పాత్ర ఏదైనా పరకాయప్రవేశం చేయడం అతడి నైజం. పలు అవార్డులను కూడా నవాజుద్దీన్ సొంతం చేసుకున్నాడు. సినిమాల విషయానికొస్తే, ఈ నటుడు హీరోపంతి 2 , బోలే చుడియాన్‌లో నటించనున్నారు. అతను బద్లాపూర్, కిక్, రామన్ రాఘవ్ 2.0, బజరంగీ భాయిజాన్, రయీస్, మాంఝీ: ది మౌంటెన్ మ్యాన్, మోతీచూర్ చక్నాచూర్ , రాత్ అకేలీ హా వంటి చిత్రాలలో నటించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..