సర్వే షిప్ ఐఎన్ ఎస్ సంధాయక్‌ను కోల్‌కతాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండియన్ నేవీకి సర్వే కోసం నాలుగు షిప్‌ల్‌ను తయారు చేయనున్నారు. ప్రస్తుతం తొలి షిప్ అందుబాటులోకి వచ్చింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ వీటిని నిర్మించింది. ఇండియాలో వార్ షిప్స్ తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇదీ ఒకటి. ఈ షిప్పుల్లో దాదాపు 80 శాతం దేశీయంగానే తయారు చేశారు. రెండు డీజిల్ ఇంజిన్లతో ఇవి నడుస్తాయి.
ఈ సంధాయక్ షిప్స్ తీర ప్రాంతంలో, సముద్రపు లోతులో హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తాయి. తీర ప్రాంత హద్దులనూ సర్వే చేస్తాయి. డిఫెన్స్ వాళ్ల కోసం ఓషనోగ్రాఫిక్, జియోగ్రాఫిక్ డేటాను కూడా సేకరిస్తాయి. దీని వల్ల తీర ప్రాంత గస్తీ, సంరక్షణ సులభమవుతుంది.