Thursday, November 21, 2024

Exclusive | తీరంలో భద్రత మరింత పటిష్టం.. ప్రిడేటర్​ డ్రోన్ల కోసం అమెరికాతో భారత్​ ఒప్పందం!

నేవీలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేందుకు భారత్​ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంలో ప్రిడేటర్​ డ్రోన్ల కోసం అమెరికాతో ఓ ఒప్పందం చేసుకుంది. అయితే.. ఇప్పటికే మూడేళ్లుగా భారత నౌకాదళం ప్రిడేటర్​ డ్రోన్లను లీజుకు తీసుకుని భద్రత పరంగా వినియోగిస్తోంది. వీటి పనితీరు బాగుండడంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి అమెరికాతో డీల్​ కుదుర్చుకుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రిడేటర్ డ్రోన్‌ల ద్వారా రక్షణ దళాలు భద్రత పరంగా మరింత పటిష్టంగా ఉంటాయని, ఈ డ్రోన్లతో దాదాపు 30 గంటలకు పైగా నిరంతరం నిఘా పెట్టవచ్చని తెలుస్తోంది. ప్రిడేటర్​ డ్రోన్లు 30 గంటలకు పైగా ఆకాశంలో ఎగరగలిగే సామర్థ్యాన్ని ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక.. బోర్డర్​లో కానీ, సముద్ర తీరంలో కానీ వీటి ద్వారా పెద్ద ఎత్తున ఫోకస్ చేసే చాన్స్​ ఉంటుందని, ఎక్కువ స్సేస్​ని​ కవర్ చేస్తాయని ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్ తెలిపారు. కాగా, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తో ఈ మధ్య భారత ప్రధాని మోదీ జరిపిన చర్చల్లో ప్రిడేటర్​ డ్రోన్ల విషయం కూడా ఉందని ఆయన వెల్లడించారు. 31 ప్రిడేటర్ డ్రోన్ల కోసం భారతదేశం, అమెరికా3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ 31 డ్రోన్‌లలో నేవీకి 15 సీగార్డియన్ డ్రోన్‌లు అందనున్నాయి. అయితే.. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ల్యాండ్ వెర్షన్-స్కైగార్డియన్‌లో ఎనిమిది చొప్పున పొందే అవకాశం ఉంది.

అమెరికా నుండి 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌ల కొనుగోలు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాటి ధర, నిర్దిష్ట నిబంధనలను భారతదేశం ఇంకా ఖరారు చేయలేదు. ప్రొక్యూర్‌మెంట్‌ను ముగించే ముందు తయారీదారు ఇతర దేశాలకు అందించే రేట్​కార్డణి కూడా పరిశీలిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక.. హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) డ్రోన్‌ల విభాగంలోకి వచ్చే ఈ డ్రోన్‌లను భారత నావికాదళం నిఘాను మెరుగుపరచడానికి.. సముద్ర డొమైన్ అవగాహనను పెంచడానికి ఉపయోగిస్తోందని అడ్మిరల్ ఆర్ హరి కుమార్ వెల్లడించారు.

- Advertisement -

తమ నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి, సముద్ర పరిసరాలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ డ్రోన్‌ల అవసరాన్ని గుర్తించినట్టు అడ్మిరల్ ఆర్. హరి కుమార్ చెప్పారు. 2020, నవంబర్​ నుంచే నేవీ రెండు ప్రిడేటర్ డ్రోన్‌లను లీజుకు తీసుకుందని, అప్పటి నుంచి వాటిని విజయవంతంగా నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement