ప్రజా తీర్పు దేవుడి తీర్పని పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ప్రజల తీర్పును తాను శిరసా వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. దాంతో ఆప్ కు శుభాకాంక్షలు తెలిపారు సిద్ధూ.ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో ఆ పార్టీ ఉంది. రాష్ట్రంలో మొత్తం 117 స్థానాలు ఉండగా… వీటిలో ఏకంగా 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యతలో ఉంది. గత ఎన్నికల్లో ఆప్ సాధించిన సీట్ల కంటే ఈ సంఖ్య 71 ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ 17 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. గతంలో సాధించిన సీట్ల కంటే కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో వెనుకబడి ఉంది. అకాళీ దళ్ 6, బీజేపీ 2 స్థానాల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీకి వెలుపల మరో రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం ఇది రెండో సారి. ఈ నేపథ్యంలో పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై విధంగా స్పందించారు.
ప్రజా తీర్పు దేవుడి తీర్పు – ఆప్ కి శుభాకాంక్షలు – నవజ్యోత్ సింగ్ సిద్ధూ
Advertisement
తాజా వార్తలు
Advertisement