వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ఇటీవల సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేయగా.. తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తానని సిద్ధూ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ లో సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమరీందర్ సింగ్ గా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్దూతో దేశానికి ముప్పు ఉందని, అతనికి పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇప్పుడు సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, సీఎం అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో ఎలక్షన్ కోడ్.. ప్రభుత్వ పథకాలకు నో బ్రేక్స్