ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి క్రేజ్ దగ్గడంలేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ పాటకి కాలుకదిపారు. కాగా భారత్‌లోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయానికి కూడా నాటు నాటు సాంగ్ ఫీవర్ పట్టుకుంది. దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటు పాటకు తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఎంబసీ తమ అధికారిక ట్విట్టర్లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ఈ క్లిప్ భారత ప్రధాని మోడీ దృష్టిని కూడా ఆకర్షించింది. దీనిపై స్పందించిన ఆయన జట్టు ప్రయత్నాన్ని ప్రశంసించారు.53 సెకన్ల నిడివిగల క్లిప్‌లో దక్షిణ కొరియా రాయబార కార్యాలయ సిబ్బంది నాటు నాటుకు చాలా ఉత్సాహంతో నృత్యం చేశారు. వారితో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్ కూడా చేరారు. టీమ్ మొత్తం పాటలోని హుక్ స్టెప్ కూడా వేసింది. ఆన్లైన్లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో 2 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement