Saturday, November 23, 2024

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన ఓటు హక్కుతో నచ్చినవారిని అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు. తన ఓటు హక్కుతో శాసించగల శక్తి ఓటరుకు ఉంది. పార్లమెంట్‌, అసెంబ్లీలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఎంతో విలువైన ఓటు హక్కు ఓ వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఎంతో విలువైన ఓటుహక్కును అందరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది.

భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతీ ఏటా బూత్‌స్థాయిలో, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అంతే కాకుండా కొత్తగా ఓటర్లుగా నమోదయిన యువతీయువకులను, ఉత్తమ అధికారులను ఓటరు దినోత్సవం రోజున ఘనంగా సన్మానిస్తారు.

2011 నుంచి ఏటా ఒక్కో నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గతేడాది 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ‘మా ఓటర్లను శక్తివంతం చేయడం, అప్రమత్తంగా, సురక్షితంగా సమాచారం ఇవ్వడం’అనే నినాదంతో నిర్వహించారు. ఈ ఏడాది ‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల అక్షరాస్యత’ అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. దొంగ ఓట్లను నివారించాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల కమిషన్ ఓటుకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. దాదాపు నూరుశాతం ఓటర్లు ఆధార్‌కార్డులతో అనుసంధానమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement