ఇండియా రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని..షరియత్ చట్టం ప్రకారం కాదని స్పష్టం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. హిజాబ్ వివాదంపై ఆయన తొలిసారిగా స్పందించారు. ప్రతి సంస్థకు తమ సొంత డ్రెస్ కోడ్ ని రూపొందించుకునే హక్కు ఉందని, అయితే రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడపాలన్నారు. దేశ వ్యవస్థ షరియత్ తో కాకుండా, రాజ్యాంగం ద్వారా నడుస్తుంది, క్రమశిక్షణకు డ్రెస్ కోడ్ ఉంది, ప్రతి సంస్థకు దాని స్వంత దుస్తుల కోడ్‌ను రూపొందించుకునే హక్కు ఉంది, అయితే అది భారత రాజ్యాంగం ప్రకారం జరిగేలా చూడాలి. ఇది ప్రతి ఒక్కరికీ ఆసక్తిని కలిగిస్తుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..