సీపీఐకి జాతీయ హోదా రద్దుపై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నేత నారాయణ తెలిపారు. జాతీయ హోదా రద్దు వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ పై వివాదాలు ఉన్నాయని నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆయన సీఈసీ నిర్ణయంపై రాజకీయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీపీఐకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సీపీఐది ముఖ్యమైన పాత్రని నారాయణ తెలిపారు. 26 రాష్ట్రాల్లో సీపీఐ పార్టీ ఉందని స్పష్టం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement