Tuesday, November 26, 2024

జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్య.. జాబ్​ రాలేదన్న కారణంతోనే అంటున్న పోలీసులు

జాతీయ స్థాయి కబడ్డీలో రాణించిన క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమినాడులో ఇవ్వాల జరిగింది. కాంచీపురంలోని తన నివాసంలో కబడ్డీ క్రీడాకారిణి బానుమతి తన గదిలోని సీలింగ్‌ ఫ్యాన్​కు ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. 25 ఏళ్ల ఈ కబడ్డీ క్రీడాకారిణి కూరగాయల వ్యాపారి అయిన ధర్మరాజ్ చిన్న కుమార్తె. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం బానుమతి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బానుమతి రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆడింది. సరైన ఉద్యోగం రాకపోవడంతో భానుమతి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమె మృతి వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement