Sunday, November 17, 2024

రేపు న్యాయాధికారుల జాతీయ సదస్సు.. హైదరాబాద్‌ వేదికగా నిర్వహణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : న్యాయాధికారుల సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈనెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ఈ సదస్సును ప్రారంభిస్తారని కేసీఆర్‌ చెప్పారు. ఆయా రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, న్యాయాధికారులు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను ఆయన నివాసంలో కలిసి సమాలోచనలు జరిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement