Tuesday, November 19, 2024

Science: రెడ్​ ప్లానెట్​పై నీటి జాడలు?.. నాసా మార్స్​ ఆర్బిటార్​ మ్యాపింగ్​తో మరింత స్పష్టత


NASAకు చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్ (MRO) రెడ్ ప్లానెట్​కు సంబంధించిన ఇంద్రధనస్సు (రెయిన్​బో) కలర్​ మ్యాప్‌ను వచ్చే ఆరు నెలల్లో విడుదల చేయడానికి రెడీగా ఉంది. 5.6 గిగాపిక్సెల్ మ్యాప్..  గ్రహం యొక్క 86 శాతాన్ని కవర్ చేస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్​ ఉపరితలం ఎట్లుంటుంది. నీటి జాడలున్నాయా? ఇతర మినరల్స్​ వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ మ్యాప్స్​​ బాగా ఉపయోగపడతాయని నాసా తెలిపింది. ఖనిజ లవణాలు, అంగారక గ్రహంపై నీటి జాడలను అన్వేషించడానికి, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి  ఇవి తమకు మరింత మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో అంగారక గ్రహం రహస్యాలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు.

అంగారక గ్రహంపై ఎంత నీరు ఉంది.. ఎప్పుడు ఉండేది?  ప్రస్తుతం ఆ గ్రహంలో నీటి జాడ లేకపోవడానికి కారణాలు ఏమిటి? అనే శాస్త్రీయ అవగాహన ఖగోళ శాస్త్రవేత్తల్లో నిరంతరం మారుతూనే ఉంది. అయితే తదుపరి పరిశోధనకు ఈమ్యాప్స్​​ తప్పకుండా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలను చెబుతున్నారు. పూర్తయిన మ్యాప్​ రెడ్ ప్లానెట్ యొక్క అత్యంత వివరణాత్మక సర్వేలలో ఒకదానిని సూచిస్తుంది. మార్స్​ రికనైన్స్​ ఆర్బిటార్​ (MRO) దాని కాంపాక్ట్ రికనైసెన్స్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఫర్ మార్స్ (CRISM) పరికరంతో 16 సంవత్సరాలుగా మార్స్ ఉపరితలంపై మ్యాపింగ్ చేస్తోంది.

కాంపాక్ట్​ రికనైసెన్స్​ ఇమేజింగ్​ స్పెక్ట్రోమీటర్​ ఫర్​ మార్స్​ (CRISM) పరికరంలో ఉపరితలాన్ని ఇన్‌ఫ్రారెడ్, ఆప్టికల్ ఫ్రీక్వెన్సీలలో చిత్రించగల డిటెక్టర్‌లు ఉన్నాయి. ఇది మార్టిన్ క్రస్ట్ యొక్క పరిణామ చరిత్రను అందిస్తుంది. మార్స్​ ఉపరితలంపై ఉన్న పురాతన ద్రవ జలం ద్వారా ఇది ఎలా మారింది. సరస్సులు, ప్రవాహాలు, చెరువులు మరియు భూగర్భజలాలు బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహాన్ని ఎలా ఆక్రమించి ఉన్నాయో అర్థం చేసుకోవడంలో గ్రహ శాస్త్రవేత్తలకు ఈ మ్యాప్‌ కీలకం కానున్నట్టు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement