కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వదేశీ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ కూలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నానికి సంబంధించి ఒక కార్టూన్ ని పోస్ట్ చేశారు. ఈ కార్టూన్ లో ప్రధాని మోడీ నీటిలో సగం మునిగి వుండగా.. ఆయన రెండు చేతులను బాహుబలిలో ప్రభాస్ చాచినట్లు చాచారు. ఇందులో ఒక చేయి ఉక్రెయిన్ను, మరొకటి భారతదేశాన్ని తాకినట్లు చూపించారు. ఉక్రెయిన్ వైపు నుంచి విద్యార్ధులు ఆయన భుజంపైకెక్కి, భారత్‌వైపుకు వస్తున్నట్లుగా వుంది. ఇదే సమయంలో ఇతర దేశాల విద్యార్ధులు సురక్షితంగా ఆ నీటిపాయను దాటేందుకు మధ్యలో ఎవరూ లేక.. వారు హెల్ప్ , హెల్ప్ అని అరుస్తున్నట్లుగా చిత్రీకరించారు. పాకిస్తాన్, చైనా, యూఎస్ విద్యార్ధులు ఒంటరిగా నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఆయా దేశాధినేతలైన ఇమ్రాన్ ఖాన్ , జీ జిన్‌పింగ్, జో బైడెన్లు మాత్రం గోడల నుంచి బయటకు చూస్తున్నట్లుగా వుంది. ప్రధాని మోడీ భారతదేశపు ఆశల వారధి అంటూ పీయూష్ గోయల్ పోస్ట్‌లో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement