Saturday, November 23, 2024

పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్ ని ప్రారంభించిన ప్ర‌ధాని – స్వ‌యంగా టికెట్ కొని చిన్నారుల‌తో ప్ర‌యాణించిన మోడీ

పుణె మెట్రో రైలు ప్రాజెక్టుని ప్రారంభించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్వ‌యంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో గార్వేర్ నుండి ఆనంద్ న‌గ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు ప్ర‌యాణించారు. కాగా ప్రధాని వెంట విద్యార్థులు కూడా ఉన్నారు. రైలులో తన పక్కన కూర్చున్న విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. పుణె మెట్రో రైలు ప్రాజెక్టు మొత్తం నిడివి 32.2 కిలోమీటర్లు కాగా, తొలి దశ కింద 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు.. అలాగే, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు రెండు మార్గాల్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రధాని పర్యటన గురించి ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది. ‘పుణె ప్రజలకు అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది భరోసానిస్తుంది’అంటూ ట్వీట్ చేసింది. పర్యటన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. కాగా పూణే మెట్రోలో తన ప్రమాణానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియా వేదికన పంచుకున్నారు. ”నా యువ మిత్రులతో కలిసి పూణే మెట్రోలో ప్రయాణం” అనే క్యాప్షన్ కు మెట్రో ప్రయాణం ఫోటోలను జతచేసి పీఎం మోదీ ట్వీట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement