Monday, November 18, 2024

ప్ర‌ధాని నోట పేరిణి మాట‌.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రధాని మోడీ ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత కళల గురించి ప్రస్తావించారు. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ పొందిన పేరిణి నృత్య కళ గురించి ఆయన మాట్లాడారు. పేరిణి నాట్యం కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నాట్యం అని, అటువంటి పేరిణి నాట్యానికి రాజ్‌కుమార్‌ నాయక్‌ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని కొనియాడారు. రాజ్‌కుమార్‌ నాయక్‌ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిస్సీ నిర్వహించారని, పేరిణి రాజ్‌కుమార్‌ పేరుతో ఆయన ప్రజలకు సుపరిచితులయ్యారని పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో పేరిణి నాటం బాగా ప్రాచుర్యం పొందిందని, ఈ నాట్య కళను శివునికి అంకితమిచ్చారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. కాకతీయ రాజవంశ మూలలు నేటి తెలంగాణకు సంబంధించినవేనని తెలిపారు. చరిత్రను, సంస్కృతిని కళాకారులను కాపాడాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. కళను, కళాకారులను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ యువ పురస్కారాలు ఇచ్చి సంగీత ప్రదర్శన రంగంలో కళాకారులను ప్రోత్సహించారని గుర్తుచేశారు.

ప్రాణాల‌ను ర‌క్షించే సంజీవ‌ని యాప్
యుపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌షిప్‌) వ్యవస్థ, ఈ-సంజీవని యాప్‌ డిజిటల్‌ ఇండియా శక్తికి ప్రకాశించే ఉదాహరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామాన్యులు, మధ్య తరగతి వారికి, కొండప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ-సంజీవని ప్రాణాలను రక్షించే ఒక యాప్‌గా మారిందన్నారు. ఇది భారతదేశ డిజిటల్‌ విప్లవ శక్తి. ఈ రోజు మనం ప్రతి ఒక్క రంగంలో దాని ప్రభావం చూస్తున్నామని మోడీ అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు దీని వైపు మళ్లాయి. కొద్ది రోజుల క్రితం భారత్‌, సింగపూర్‌ మధ్య యూపీఐ-పే నౌ లింక్‌ ప్రారంభమైంది. ఇప్పుడు, సింగపూర్‌, భారత్‌ ప్రజలు తమ మొబైల్‌ ఫోన్ల నుంచి నగదు బదలీ చేస్తున్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నానని మోడీ అన్నారు. భారత్‌ దేశ ఈ-సంజీవని యాప్‌, యూపిఐలు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ని పెంచడంలో ఇవి ఎంతో సహాయకారిగా ఉన్నాయని అన్నారు. అంతకుముందు, భారత్‌ యూపీఐ విజయ కథనాన్ని పంచుకుంటూ, యూపీఐ పెరుగుతున్న ప్రజాదరణను మీరు(ప్రజలు) ఎలా బయటికి తెచ్చారో నాకు నచ్చింది. డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించినందుకు నా తోటి భారతీయులను నేను అభినందిస్తున్నాను. వారు సాంకేతిక, ఆవిష్కరణలకు విశేషమైన అనుకూలతను చూపించారని మోడీ ట్విట్‌ చేశారు. మోడీ ప్రభుత్వం ఇటీవల భారతదేశం యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌షిప్‌(యూపీఐ)ని సింగపూర్‌కు చెందిన పేనౌని లింక్‌ చేసింది. దీని ద్వారా ఇరు దేశాల నివాసితులు సరిహద్దు చెల్లింపులను వేగంగా.. మరింత తక్కువ ఖర్చుతో బదిలీ చేయడానికి వీలు కల్పించారు. డిజిటల్‌ చెల్లింపుల్లో ఇది ఒక మైలు రాయిగా చెప్పవచ్చు. దీనితో సింగపూర్‌లోని భారతీయ ప్రవాసులకు, ముఖ్యంగా కార్మికులు, విద్యార్థులకు సింగపూర్‌ నుంచి భారతదేశానికి తక్షణం.. తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ చేసేందుకు వీలవుతోంది.

దేశభక్తి గీతాలలో విజేతగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి. విజయ దుర్గ – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి ప్రేరణ

ప్రధాని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ముఖ్యంగా ఏక్తా దీవాస్‌కు సంబంధించి పాటలు, జోల పాటలు, ముగ్గుల పోటీలకు సంబంధించి ప్రధాని ప్రస్తావించిన అంశాలలో దేశభక్తి గీతాలలో విజేతగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి. విజయ దుర్గ నిలిచారని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. స్వాతంత్య్ర సమయయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నుంచి ఎంతో ప్రేరణ పొంది ఆమె పంపిన గీతాన్ని ప్రధాని ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులపై పోరాటం చేసిన నరసింహారెడ్డి గీతం తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి రేనాటి సూర్యుడా ఓ వీర నరసింహా గీతాన్ని ప్రధాని ప్రస్తావించారు. స్వాంతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయుల నిరంకుశ, అణచివేతను చూసి ఆయన రక్తం మరిగిందని ఆమె తమ గీతంలో పొందుపర్చారని ప్రధాని పేర్కొన్నారు.మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఏపీకి చెందిన మహిళ టి.విజయదుర్గ పాడిన పాటను వినిపించారు. ఈ సారి దేశభక్తియుత పాటలు పాడిన వారి గురించి మాట్లాడిన ప్రధాని.. తెలుగులో పాటను రాసి పంపించిన ఏపీకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డిపై టి.విజయ దుర్గ అనే మహిళ పాడిన 27 సెకన్ల ఆడియో క్లిప్‌ని అందరికీ వినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మీరంతా ‘మన్‌ కీ బాత్‌’ను అద్భుతమైన వేదికగా మార్చుకున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement