నిన్నటితో వంద తప్పులు అయిపోయాయని హీరో నారా రోహిత్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనపై స్పందించారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికారపార్టీ నేతలు ప్రవర్తిన్నారన్నారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిని దూసించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాజకీయాలపై…విధానాలపై విమర్శలుండాలి గానీ కుటుంబ సభ్యులను లాగటం సరికాదన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం హక్కును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం వారి భ్రమే అవుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉన్నారని….. అందుకే వారి మనుగడ సాగిందని నారా రోహిత్ పేర్కొన్నారు. శిశుపాలుడిలాగే నిన్నటితో వారి వంద తప్పులు పూర్తయ్యాయని ఇక వారి అరాచకాన్ని ఉపేక్షించేది లేదని నారా రోహిత్ మండిపడ్డారు. ప్రతి ఒక్క తెలుగు దేశం కార్యకర్త.. వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని నారా రోహిత్ వార్నింగ్ ఇచ్చారు. స్థాయిలేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న అంటూ నారారోహిత్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి మనుషుల మధ్య బతకడం సిగ్గు చేటన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..