Friday, November 22, 2024

ఏపీలో పెగాసస్‌ ప్రకంపనలు.. బెంగాల్ సీఎం ప్రకటనపై టీడీపీ రియక్షన్

ఏపీ రాజకీయాల్లో పెగాసెస్ వ్యవహారం దూమారం రేపుతోంది. చంద్రబాబు హయాంలో పెగాసస్‌ స్పైవేర్‌ కొన్నారని బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ చేసిన ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే, మమత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. మమత వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐటీ మంత్రి లోకేశ్‌ స్పందించారు. పెగాసస్ స్పైవేర్‌ను టీడీపీ కొనుగోలు చేసిందన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆరోపణను నారా లోకేష్ ఖండించారు. నాటి ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు చేసి ఉంటే ఇప్పటికే దొరికిపోయేవాళ్లమని ఆయన తెలిపారు. NSO గ్రూప్ తన స్పైవేర్‌ను అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిందని, అయితే వారు దానిని తిరస్కరించారని ఆయన తెలిపారు.

టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ కొనుగోలు చేయలేదని డీజీపీ గౌతం సవాంగ్‌ చెప్పారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన ప్రతిని ఆయన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement